News October 19, 2024

గ్రేట్.. చెట్లను కాపాడేందుకు రెండేళ్లు పోరాటం!

image

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జులియా హిల్ పర్యావరణ పరిరక్షకురాలు. 1997లో ఓ కంపెనీ చైర్ల తయారీ కోసం వెయ్యేళ్ల భారీ వృక్షాలను తొలగించేందుకు సిద్ధమైంది. దీంతో జులియా ఓ వృక్షంపైకి ఎక్కి 200 ఫీట్ల ఎత్తులో నిరసన తెలిపారు. చలి, కుండపోత వర్షాలను ఎదుర్కొని 738 రోజులు దిగకుండా చెట్టుపైనే ఉండిపోయారు. కంపెనీ వెనకడుగేయడంతో ఆమె తన పోరాటంలో విజయం సాధించారు. కొన్నిరోజుల్లోకే ఆ కంపెనీ దివాలా తీసింది.

Similar News

News October 19, 2024

BREAKING: భారత్ ఆలౌట్

image

NZతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా అద్భుత పోరాటం ముగిసింది. 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ 150, పంత్ 99 రన్స్ చేశారు. కివీస్ ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ ఈ రన్స్ కొట్టకుండా రోహిత్ సేన అడ్డుకోగలదా? కామెంట్ చేయండి.

News October 19, 2024

రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: DGP

image

TG: హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

News October 19, 2024

డెలివరీ సేవలపై కర్ణాటక సెస్!

image

జొమాటో, ఓలా, ఉబర్, స్విగ్గీ తదితర సంస్థల డెలివరీ సేవలపై పన్ను విధించాలని నిర్ణయించినట్లు కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. ‘రవాణా మీద మాత్రమే ఈ పన్ను విధిస్తున్నాం. డెలివరీ ఏజెంట్లు రోడ్డుపైనే ఎక్కువ ఉంటారు కాబట్టి వారు ప్రమాదాలకు గురయ్యేందుకు, కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలయ్యేందుకు అవకాశాలెక్కువ. ఈ డబ్బును వారి సంక్షేమానికి, వారి పిల్లల చదువులకు వినియోగిస్తాం’ అని పేర్కొన్నారు.