News October 19, 2024

అయ్యర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా ముంబై

image

రంజీ ట్రోఫీలో మహారాష్ట్రతో జరుగుతున్న టెస్టులో ముంబై తొలి ఇన్నింగ్సులో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ అయుష్(176), శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 200 పరుగులకు పైగా ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్సులో మహారాష్ట్ర 126 పరుగులకే ఆలౌటైంది. కాగా శ్రేయస్‌కు ఇది 14వ ఫస్ట్ క్లాస్ సెంచరీ.

Similar News

News October 19, 2024

రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు.. నటుడిపై కేసు

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు పెట్టిన ఒడిశా నటుడు బుద్ధాదిత్య మొహంతీపై కేసు నమోదైంది. ఎన్సీపీ నేత సిద్దిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా తర్వాత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవాలని ఆయన పోస్టు పెట్టినట్లు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొహంతి ఆ పోస్టు డిలీట్ చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 19, 2024

కుక్క లేదా పాము కరిచిందా?

image

కుక్క, పాము కాటు బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్ 15400 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. బాధితులు ఈ నంబర్‌కు కాల్ చేస్తే వ్యాక్సిన్లు ఎక్కడ లభిస్తాయో తెలియజేస్తారు. ఈ నంబర్ ఉ.9 నుంచి సా.6 గంటల వరకు పనిచేస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఏపీ వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తాజాగా ఆవిష్కరించారు.

News October 19, 2024

అయ్యో పంత్.. ఏడు సెంచరీలు మిస్!

image

రిషభ్ పంత్‌ను 90 పరుగులు దాటాక దురదృష్టం వెంటాడుతోంది. 2018లో తాను అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 7సార్లు 90ల్లో ఔటయ్యారు. 2018లో WIపై రాజ్‌కోట్, హైదరాబాద్ టెస్టుల్లో 92 రన్స్‌కి, 2021లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై 97 రన్స్, అదే ఏడాది ఇంగ్లండ్‌పై చెన్నైలో 91 రన్స్, 2022లో మొహాలీలో శ్రీలంకపై మ్యాచ్‌లో 96 రన్స్, అదే ఏడాది మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై 93 రన్స్, ఈరోజు 99 రన్స్‌కి పంత్ ఔటయ్యారు.