News October 19, 2024

ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో హైకోర్టు బెంచ్: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని, అదే ఏకైక రాజధాని అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. అమరావతి కోసం 54వేల ఎకరాలు సేకరిస్తే గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని దుయ్యబట్టారు. రైతులను అడుగడుగునా అణగదొక్కినా వాళ్లు అద్భుతంగా పోరాడారని పేర్కొన్నారు.

Similar News

News October 19, 2024

టెస్టుల్లో 550 సెంచరీలు చేసిన భారత క్రికెటర్లు

image

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు భారత క్రికెటర్లు చేసిన సెంచరీల సంఖ్య 550కి చేరింది. తాజాగా NZతో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ చేసిన సెంచరీ 550వది. తొలి సెంచరీని 1933లో లాలా అమర్నాథ్, 50వ సెంచరీ పాలీ ఉమ్రిగర్, 100,150వ సెంచరీలు సునీల్ గవాస్కర్, 200th అజహరుద్దీన్, 250th, 300th సచిన్ టెండూల్కర్, 350th వీవీఎస్ లక్ష్మణ్, 400th రాహుల్ ద్రవిడ్, 450th అజింక్య రహానే, 500వ సెంచరీ విరాట్ కోహ్లీ చేశారు.

News October 19, 2024

గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్ న్యాయమైనదే: బండి సంజయ్

image

TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘గ్రూప్-1 రద్దు చేయమని అడగట్లేదు. వాయిదా వేయాలని కోరుతున్నాం. జీవో 29తో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవం. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని అభ్యర్థులు భయపడుతున్నారు. అభ్యర్థుల డిమాండ్ న్యాయమైనదే. వారిపై లాఠీఛార్జ్ జరగడం చూసి బాధనిపిస్తోంది’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.

News October 19, 2024

తప్పు చేయలేదు..క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: సల్మాన్ తండ్రి

image

తన కొడుకు కృష్ణజింకల్ని ఎప్పుడూ చంపలేదని నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ తెలిపారు. ‘కృ‌ష్ణజింకల్ని కాదు కదా మేమెప్పుడూ బొద్దింకల్ని కూడా చంపలేదు. సల్మాన్‌కు జంతువులంటే చాలా ఇష్టం. తన పెంపుడు కుక్క చనిపోతేనే రోజుల తరబడి ఏడ్చాడు. అలాంటిది కృష్ణజింకల్ని చంపుతాడా? మా కుటుంబం తుపాకీని ఎప్పుడూ వాడలేదు. తప్పే చేయని సల్మాన్ క్షమాపణ ఎందుకు చెబుతాడు? ఆ ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.