News October 19, 2024

ఒక్క బాంబు బెదిరింపు కాల్‌తో రూ.3 కోట్ల నష్టం

image

బాంబు బెదిరింపు కాల్స్‌తో ఎయిర్‌లైన్స్ కంపెనీల చమురు వదులుతోంది! ఒక్కో నకిలీ కాల్ వల్ల రూ.3 కోట్ల వరకు నష్టపోతున్నట్టు అంచనా. దారి మళ్లిస్తే అదనపు ఫ్యూయల్ కోసం రూ.కోటి వరకు ఖర్చవుతోంది. ఇక ఫ్లైట్ ల్యాండింగ్, ఎయిర్‌పోర్ట్ పర్మిషన్లు, ప్రయాణికులకు లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, ఇతర అవసరాలకు మరో రూ.2కోట్లు కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 40 ఫేక్ కాల్స్ వల్ల కంపెనీలపై రూ.60-80కోట్ల అదనపు భారం పడింది.

Similar News

News October 19, 2024

IAS అధికారి అమోయ్‌కు ఈడీ నోటీసులు

image

తెలంగాణకు చెందిన IAS అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల వ్యవహారంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఆయనకు నోటీసులు పంపింది.

News October 19, 2024

నారా లోకేశ్ ఆగ్రహం

image

AP: విశాఖ పర్యటనలో భాగంగా నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మంత్రి లోకేశ్ ఉ.9.45 గంటలకూ ఓపెన్ కాకపోవడంపై ఫైరయ్యారు. నిర్వహణ తీరుపై మండిపడ్డారు. గ్రంథాలయాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఓ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్‌ను అధ్యయనం చేసి APలో అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

News October 19, 2024

అంపైర్లతో రోహిత్ శర్మ వాగ్వాదం

image

బ్యాడ్ లైట్ కారణంగా భారత్-న్యూజిలాండ్ <<14399404>>మ్యాచ్‌ను <<>>అంపైర్లు నిలిపివేశారు. బుమ్రా 4 బంతులు వేసిన అనంతరం స్టేడియం చుట్టూ నల్లమబ్బులు కమ్మేయడంతో ఇవాళ్టి ఆటను ఆపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర భారత ప్లేయర్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. వర్షం పడకున్నా మ్యాచ్ నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాసేపటికే స్టేడియంలో కుండపోత వర్షం ప్రారంభమైంది.