News October 19, 2024
ఏలూరు జిల్లాలో నలుగురు పోలీసులు సస్పెండ్

నిడదవోలు సీఐ శ్రీనివాసరావు, పెరవలి ఎస్ఐ అప్పారావు, పెరవలి స్టేషన్ రైటర్, పెరవలి కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరవలి మండలం ముక్కామల గ్రామ పరిధిలో సెప్టెంబర్ 8వ తేదీన జరిగిన ఓ పేకాట శిబిరంపై దాడి చేసి కేసులో అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆ కేసును తప్పుదోవ పట్టించారనే పలు ఆరోపణలు రావడంతో విచారించి, శాఖా పరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News February 25, 2026
ప.గో: నిరుద్యోగ యువతకు GOOD NEWS

భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 21 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
News February 24, 2026
ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.