News October 19, 2024
రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది: బండి సంజయ్

TG: గ్రూప్-1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి ర్యాలీ చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రం మొత్తం అగ్గి రగులుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు ర్యాలీలో BJP, BRS కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Similar News
News January 8, 2026
ఎంచివేస్తే, ఆరిక తరుగుతుందా?

కొందరు తమ దగ్గర ఉన్న సంపదను పదే పదే లెక్కబెడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆ ధ్యాసలోనే బతుకుతారు. అయితే మన దగ్గర ఉన్న సంపద లేదా ధాన్యాన్ని ఎన్నిసార్లు లెక్కపెట్టినా అవి పెరిగిపోవు, తరగిపోవు. అవి మొదట ఎంత ఉన్నాయో, ఎన్నిసార్లు లెక్కించినా అంతే ఉంటాయి. వాటి గురించి పదే పదే ఆలోచన తగదు అని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.
News January 8, 2026
విగ్రహాల శుద్ధిలో ఏ పదార్థాలు వాడాలి?

దేవుడి విగ్రహాలను శుభ్రం చేయడానికి రసాయనాలు వాడకూడదు. పసుపు, కుంకుమ, విభూతి, నిమ్మరసం వంటి సహజ పదార్థాలు వాడటం ఉత్తమం. ముఖ్యంగా రాగి, ఇత్తడి విగ్రహాలను చింతపండు లేదా నిమ్మకాయతో తోమడం వల్ల అవి కొత్తవాటిలా మెరుస్తాయి. కడిగిన తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి, ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల విగ్రహాల శక్తి సడలకుండా ఉంటుంది. గుర్తుంచుకోండి.. మంగళ, శుక్రవారాల్లో విగ్రహాలకు జల స్నానం చేయించడం నిషిద్ధం.
News January 8, 2026
మెట్రో, RTC, MMTSకి ఒకే టికెట్

TG: మెట్రో, MMTS, RTC సేవలను అనుసంధానం చేసే కీలక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. నెలరోజుల్లో ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లలో దిగిన ప్రయాణికులు నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మూడు రవాణా సేవలకు కలిపి ఒకే టికెట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.


