News October 19, 2024

సెంచరీ మిస్.. స్టేడియంలో హార్ట్ బ్రేకింగ్!

image

గాయంతో బాధపడుతూనే రిషభ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. సెంచరీ చేస్తారని అంతా భావించగా 99 రన్స్ వద్ద ఔట్ అవడంతో స్టేడియమంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. మోకాలి నొప్పితోనే వీరోచితంగా ఆడి 9 ఫోర్లు, 5 సూపర్ సిక్సులతో పంత్ అదరగొట్టారు. పంత్‌కు సెంచరీ మిస్ అయినప్పటికీ ప్రేక్షకులు, ఆటగాళ్ల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇది అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News October 19, 2024

‘OG’ కవర్ పిక్ చూశారా?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘OG’ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఫ్యాన్స్ కోసం మేకర్స్ తాజాగా కవర్ పిక్‌ను రిలీజ్ చేశారు. ‘ఈ వీధులు మళ్లీ ఎప్పుడూ ఇలా ఉండవు’ అని క్యాప్షన్ ఇచ్చారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి తదితరులు నటిస్తున్నారు.

News October 19, 2024

వాయిదాలతో విద్యార్థులకే నష్టం: రేవంత్

image

TG: పోటీ పరీక్షలను నిత్యం వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుందని CM రేవంత్ చెప్పారు. ‘తరచూ వాయిదా వేస్తే విద్యార్థులకే నష్టం. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీని BRS పట్టించుకోలేదు. గతంలో ఆ పార్టీ నేతలు నిరుద్యోగులను ఎప్పుడైనా కలిశారా? పరీక్షల నిర్వహణను కోర్టులూ సమర్థించాయి. అభ్యర్థులు ఆందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని CM కోరారు.

News October 19, 2024

గ్రూప్-1 అభ్యర్థులపై కేసులు పెట్టొద్దు: CM

image

TG: ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని CM రేవంత్ పోలీసులను ఆదేశించారు. ‘కొందరు అభ్యర్థులు భావోద్వేగంలో ఉన్నారు. వాళ్లపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లపై కేసులు పెడితే పోటీ పరీక్షల్లో రాణించినా ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. వీళ్లు గ్రూప్-1 పరీక్షల్లో పాసైతే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతారు. అభ్యర్థులపై మానవత్వంతో వ్యవహరించండి’ అని పోలీసులకు సూచించారు.