News October 19, 2024
కుక్క లేదా పాము కరిచిందా?

కుక్క, పాము కాటు బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్ 15400 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. బాధితులు ఈ నంబర్‌కు కాల్ చేస్తే వ్యాక్సిన్లు ఎక్కడ లభిస్తాయో తెలియజేస్తారు. ఈ నంబర్ ఉ.9 నుంచి సా.6 గంటల వరకు పనిచేస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఏపీ వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తాజాగా ఆవిష్కరించారు.
Similar News
News February 11, 2026
టారిఫ్‌లే అస్త్రంగా భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేశా: ట్రంప్

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి అన్నారు. ఇరుదేశాలు దాదాపు అణు యుద్ధం దిశగా సాగాయని చెప్పుకొచ్చారు. టారిఫ్‌లను అస్త్రంగా వాడి ఘర్షణల్ని నివారించినట్లు చెప్పారు. తన మధ్యవర్తిత్వం వల్ల దాదాపు కోటి మందికి చావు తప్పిందని స్వయంగా పాక్ ప్రధాని చెప్పినట్లు తెలిపారు. ఇరు దేశాల ఘర్షణల్లో దాదాపు 10 విమానాలు కుప్పకూలినట్లు చెప్పారు. మనుషులు చనిపోవడం ఇష్టంలేకే యుద్ధాల్ని ఆపానన్నారు.
News February 11, 2026
స్కూల్లో కాల్పులు.. 9 మంది మృతి

కెనడాలోని స్కూల్లో దుండగుడి కాల్పుల్లో 9 మంది చనిపోయారు. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సెకండరీ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దుండగుడు చనిపోయాడని లోకల్ మీడియా తెలిపింది. కాల్పులు ఎవరు, ఎందుకు జరిపారు, బాధితులంతా విద్యార్థులేనా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2026
భారత్‌లో తగ్గిన అవినీతి

ఇండియాలో అవినీతి తగ్గినట్లు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. కరప్షన్ ఇండెక్స్‌లో 2024లో 182 దేశాల్లోకెల్లా 96వ స్థానంలో ఉన్న భారత్ 2025 నాటికి 91వ స్థానానికి ఎగబాకింది. డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్.. అతితక్కువ అవినీతి ఉన్న దేశాలుగా నిలిచాయి. దక్షిణ సూడాన్, సోమాలియా అత్యంత అవినీతిమయ దేశాలుగా నిలిచాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత USలో అవినీతి పెరిగినట్లు తేలింది.


