News October 19, 2024

నవంబర్ 1 వరకు లోకేశ్ ప్రజా దర్బార్ రద్దు

image

నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం రద్దు చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజా దర్బార్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉండవల్లిలోని మంత్రి నివాసానికి రావద్దని, మళ్ళీ ప్రజా దర్బార్ జరిగే తేదీని త్వరలో చెప్తామని పేర్కొన్నారు.

Similar News

News January 14, 2026

‘మన మిత్ర’తో వాట్సాప్‌లోనే పోలీస్ సేవలు: ఎస్పీ

image

గుంటూరు జిల్లాలో ‘మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. ఇకపై ఎఫ్‌ఐఆర్ కాపీ, స్టేటస్, ఈ-చలానా వివరాల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు. మెనూలో పోలీస్ సేవలను ఎంచుకుని వివరాలు పొందవచ్చు. ప్రజలు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఎస్పీ కోరారు.

News January 14, 2026

బుల్లెట్ బండిని గెలుచుకున్న గుంటూరు కోడి పుంజు

image

కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడిపందేలలో రాజధాని ప్రాంతం నుంచి తుళ్లూరుకి చెందిన కోడి పుంజు పందెంలో నెగ్గింది. దీంతో నిర్వాహకులు వారికి బుల్లెట్ బండిని బహుమతిగా అందజేశారు. బుల్లెట్ వాహనం ఖరీదు సుమారు రూ.2.50 లక్షల పైన ఉంటుందని చెబుతున్నారు. పందేలను వీక్షించేందుకు భారీగా జనం గుమిగూడారు.

News January 14, 2026

గుంటూరు: DLSAలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా న్యాయసేవాధికార సంస్ధ(DLSA)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DLSA కార్యదర్శి జియావుద్దీన్ తెలిపారు. ఒక రికార్డు అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టును ఓపెన్ కేటగిరీలో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు
https://Guntur.dcourts.gov.inని సందర్శించాలని సూచించారు.