News October 19, 2024
ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయి: జగన్

AP: కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలింది. విజయనగరం జిల్లా గుర్లలో ప్రబలిన అతిసార ఘటనలే దీనికి ఉదాహరణ. 11 మంది చనిపోయినా ప్రభుత్వం నిద్ర వీడడం లేదు. ఆస్పత్రులున్నా స్థానిక స్కూళ్లలో బెంచీల మీద చికిత్స అందించడం దారుణం. ఇప్పటికైనా డయేరియా బాధిత గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 9, 2026
BRSను యాసిడ్ పోసి కడగాలి: రేవంత్

TG: BRS పార్టీని యాసిడ్ పోసి కడగాలని, ఆ పార్టీ మొక్క మొలవనివ్వకూడదని CM రేవంత్ ధ్వజమెత్తారు. అప్పుడే రాష్ట్రానికి, మున్సిపాలిటీలకు పట్టిన దుర్భరమైన పరిస్థితి మారుతుందన్నారు. BJP-BRSది విడదీయరాని అనుబంధం అని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు BRS పార్లమెంటులో బీజేపీకి సహకరించిందన్నారు. ఆ సాయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రేసింగ్ తదితర కేసుల్లో KCR, హరీశ్‌రావు, KTRలను ED, CBI కాపాడుతున్నాయని ఆరోపించారు.
News February 9, 2026
పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా: రేవంత్

TG: పదేళ్లు పెత్తనం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు తమ ప్రభుత్వంపై విషం చిమ్మడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పదేళ్లు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు వాళ్లే ఉన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో ఇంకా సమస్యలు ఉన్నాయంటే వారే కారణం. ఇప్పుడు మళ్లీ వచ్చి ఓటు వేయాలని అడిగేందుకు అర్హత ఉందా?’ అని ఫైర్ అయ్యారు.
News February 9, 2026
మీ షాంపూలో సల్ఫేట్ ఉందా..?

మార్కెట్‌లో లభించే చాలా షాంపూల్లో ఉండే సల్ఫేట్ జుట్టుకు ప్రమాదకరమని చర్మ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి తలపై ఉండే సహజ నూనెలను పూర్తిగా తొలగించి జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు. సల్ఫేట్-ఫ్రీ షాంపూలు ఉపయోగిస్తే జుట్టు ఆయిలీగా అనిపించినా స్కాల్ప్ హెల్త్ మెరుగుపడుతుందని అంటున్నారు. అదే విధంగా తలపై తేమ ఉండటం వలన హెయిర్ హెల్తీగా ఉంటుందని సూచిస్తున్నారు.


