News October 19, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బ్లాస్ట్.. ఇద్దరు జవాన్ల వీరమరణం

image

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈరోజు ఉదయం స్థానిక ధుర్బేద ప్రాంతంలో కూంబింగ్ కోసం ఐటీబీపీ, జిల్లా రిజర్వు గార్డ్ బలగాలు వెళ్తున్న సమయంలో కొడ్లియార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏపీలోని కడపకు చెందిన కె రాజేశ్ అనే జవాను ఉండటం గమనార్హం.

Similar News

News October 20, 2024

పంత్ ఔట్‌ను ముందే చెప్పిన నెటిజన్!

image

టెస్టు మ్యాచ్‌లో నాలుగోరోజు రిషభ్ పంత్ 99 పరుగులకు ఔటైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఓ నెటిజన్ ముందుగానే పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంత ముందుగా, కచ్చితత్వంతో అతడెలా చెప్పాడన్నది మిస్టరీగా మారింది. నువ్వు మ్యాచ్ ఫిక్సర్‌వా అంటూ కొంతమంది, నా జాతకం చెప్పు బాస్ అంటూ మరికొంతమంది అతడి ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం నీవల్లే రిషభ్ ఔటయ్యారంటూ మండిపడుతున్నారు.

News October 20, 2024

కర్వా చౌత్.. రూ.22 వేల కోట్ల వ్యాపారం?

image

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రేపు కర్వా చౌత్ వేడుక జరుపుకోనున్నారు. గత ఏడాది ఈ పండుగకు రూ.15వేల కోట్ల మేర వ్యాపారం జరగగా, ఈసారి అది రూ.22 వేల కోట్లకు పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేశారు. ఢిల్లీలోనే రూ.4వేల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఎర్రగాజులు, సంప్రదాయ దుస్తులు, పూజాసామగ్రి, లాకెట్లు, మెట్టెలు, ఆభరణాల వంటివాటికి డిమాండ్ నెలకొందని వివరించారు.

News October 20, 2024

తెలంగాణ పోలీసులు దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్

image

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి పోలీస్ డ్యూటీ మీట్‌కు హాజరుకావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడే ఖాకీ సైనికులు, పెట్టుబడుల సాధనకు భరోసా కల్పించే శాంతిభద్రతకు ప్రతినిధులు, దేశానికే గర్వకారణం తెలంగాణ పోలీసులు’ అంటూ ఓ ట్వీట్‌లో కొనియాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అన్న హాష్ ట్యాగ్‌లను దానికి జోడించారు.