News October 19, 2024
ప్రపంచ రికార్డు సృష్టించిన పసికూన

క్రికెట్ పసికూన జింబాబ్వే చరిత్ర సృష్టించింది. సీషెల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకుండానే 20 ఓవర్లలో 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. 35 బంతుల్లో 91 రన్స్‌తో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. మరో ఓపెనర్ మరుమణి 37 బంతుల్లో 86 రన్స్ చేశారు. ఛేజింగ్‌లో సీషెల్స్ 6.1 ఓవర్లలో 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.
Similar News
News November 8, 2025
బుమ్రా కాదు.. వాళ్లిద్దరే డేంజర్: అశ్విన్

టీ20 ఫార్మాట్‌లో బుమ్రా కన్నా వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ప్రమాదమని టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘భారత్‌లో జరగబోయే T20 WCను గెలవాలనుకుంటే వాళ్లు చక్రవర్తి, అభిషేక్ శర్మ రూపంలోని అడ్డంకులను దాటాల్సిందే. వీరి కోసం ప్రత్యేక వ్యూహాలు రెడీ చేసుకుంటేనే ప్రత్యర్థులు గెలవగలరు. ఆసీస్ అభిషేక్ కోసం వాడుతున్న షార్ట్ బాల్ స్ట్రాటజీ బాగుంది. WCలోనూ వాళ్లు ఇదే వాడొచ్చు’ అని తెలిపారు.
News November 8, 2025
అసోసియేషన్ల తీరుతో నష్టపోతున్న క్రీడాకారులు!

AP: ఇటీవల DSCలో స్పోర్ట్స్ కోటా కింద కొందరు ఉద్యోగానికి అనర్హులయ్యారు. గుర్తింపులేని అసోసియేషన్లతోనే క్రీడాకారులు నష్టపోతున్నారని శాప్ తెలిపింది. APలో మొత్తం 63 స్పోర్ట్స్ అసోసియేషన్లు ఉండగా.. అందులో శాప్ గుర్తించినవి 35 మాత్రమే. గుర్తింపులేని వాటి తరఫున సర్టిఫికెట్లు సాధించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలుసుకుని గుర్తింపులేని అసోసియేషన్ల తరఫున ఆడొద్దని సూచిస్తున్నారు.
News November 8, 2025
MP సాన సతీశ్‌పై CM చంద్రబాబు ఆగ్రహం!

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్‌పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.


