News October 20, 2024
తెలంగాణ పోలీసులు దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి పోలీస్ డ్యూటీ మీట్‌కు హాజరుకావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడే ఖాకీ సైనికులు, పెట్టుబడుల సాధనకు భరోసా కల్పించే శాంతిభద్రతకు ప్రతినిధులు, దేశానికే గర్వకారణం తెలంగాణ పోలీసులు’ అంటూ ఓ ట్వీట్‌లో కొనియాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అన్న హాష్ ట్యాగ్‌లను దానికి జోడించారు.
Similar News
News February 19, 2026
ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాల వల్ల ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని సూచించింది. భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని గుర్తుచేసింది. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాలూ ఉచితాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది. ఆ సొమ్మును ప్రణాళికాబద్ధంగా వాడాలని సూచించింది. DMK ఉచిత విద్యుత్ ప్రతిపాదనల పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
News February 19, 2026
తెలుగు రాష్ట్రాల తీరుపై CWC అసంతృప్తి

TG: జలవివాదాల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల వైఖరిపై CWC అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇవ్వాల్సిన అజెండాను AP, TG పంపకపోవడంతో JAN 30న జరిగిన భేటీ నిర్ణయాలు లేకుండానే ముగిసింది. తదుపరి భేటీకి 10 రోజుల్లో అజెండా పంపిస్తామని రెండూ అప్పట్లో చెప్పాయి. అయితే 20 రోజులైనా వాటి జాడలేదు. దీనిపై కమిషన్ సీరియస్ అయినట్లు సమాచారం. దీనిపై TG అధికారులు స్పందిస్తూ నెలాఖరుకు అందిస్తామని తెలిపారు.
News February 19, 2026
మదనపల్లె మృగాడికి మరణం తర్వాతా శిక్ష

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబం నిరాకరించింది. నిన్న పోస్టుమార్టం రిపోర్టుపై సంతకానికి సైతం రాకపోవడంతో అతడి పెదనాన్న సమ్మతితో ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు బాడీ కోసం ఎవరూ రాకపోవడంతో అనాథ శవంగా మున్సిపాలిటీ సిబ్బంది ఖననం చేయనున్నారు. కాగా 7సం.ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ కులవర్ధన్, శిక్ష భయంతో చెరువులో దూకి చనిపోయాడు.


