News October 20, 2024

కర్వా చౌత్.. రూ.22 వేల కోట్ల వ్యాపారం?

image

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రేపు కర్వా చౌత్ వేడుక జరుపుకోనున్నారు. గత ఏడాది ఈ పండుగకు రూ.15వేల కోట్ల మేర వ్యాపారం జరగగా, ఈసారి అది రూ.22 వేల కోట్లకు పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేశారు. ఢిల్లీలోనే రూ.4వేల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఎర్రగాజులు, సంప్రదాయ దుస్తులు, పూజాసామగ్రి, లాకెట్లు, మెట్టెలు, ఆభరణాల వంటివాటికి డిమాండ్ నెలకొందని వివరించారు.

Similar News

News October 20, 2024

గుర్లలో డయేరియా తగ్గుముఖం పట్టింది: మంత్రి కొండపల్లి

image

AP: భూగర్భ జలాల కలుషితం వల్లే విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం వ్యాప్తి చెందిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం గుర్లలో అతిసారం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. 41 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. క్లోరినేషన్ పనులు చేపట్టామని, ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం తాగునీటి వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.

News October 20, 2024

యుద్ధానికి సిద్ధం కావాలని సైన్యానికి జిన్‌పింగ్ పిలుపు

image

తైవాన్ విషయంలో బీజింగ్ దూకుడు పెంచింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ సైన్యానికి పిలుపునిచ్చారు. ఆర్మీ రాకెట్ ఫోర్స్‌ను పరిశీలించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సీసీటీవీ తెలిపింది. ‘సైనిక శిక్షణ మరింత పెరగాలి. బలగాలన్నింటికీ పోరాట, వ్యూహాత్మక సామర్థ్యం అలవడాలి’ అని జిన్‌పింగ్ పేర్కొన్నారని స్పష్టం చేసింది. తైవాన్ తమదేనంటూ చైనా చెప్పుకొంటున్న సంగతి తెలిసిందే.

News October 20, 2024

మద్యం తాగేముందు ఆ రెండు చుక్కలు ఎందుకు?

image

మద్యం తాగే ముందు రెండుమూడు చుక్కలను నేలపై చల్లడం చూస్తుంటాం. దిష్టి తలగకుండా అని, పెద్దలకోసం అని కొందరు చెబుతుంటారు. అయితే, గతంలో ఇంట్లోనే మద్యం తయారుచేసుకునేవారని, దీన్ని పరీక్షించేందుకు ఇలా చేసేవారని మరికొందరు అంటున్నారు. నేలపై లిక్కర్ చుక్కలు వేసినప్పుడు బుడగలు ఏర్పడితే స్ట్రాంగ్‌ ఉందని అర్థమని చెప్పారు. రాజులపై విష ప్రయోగం జరిగిందో లేదో తెలుసుకోడానికి గతంలో ఇలా చేసేవారని మరికొందరి మాట.