News October 20, 2024

పంత్ ఔట్‌ను ముందే చెప్పిన నెటిజన్!

image

టెస్టు మ్యాచ్‌లో నాలుగోరోజు రిషభ్ పంత్ 99 పరుగులకు ఔటైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఓ నెటిజన్ ముందుగానే పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంత ముందుగా, కచ్చితత్వంతో అతడెలా చెప్పాడన్నది మిస్టరీగా మారింది. నువ్వు మ్యాచ్ ఫిక్సర్‌వా అంటూ కొంతమంది, నా జాతకం చెప్పు బాస్ అంటూ మరికొంతమంది అతడి ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం నీవల్లే రిషభ్ ఔటయ్యారంటూ మండిపడుతున్నారు.

Similar News

News October 20, 2024

మద్యం తాగేముందు ఆ రెండు చుక్కలు ఎందుకు?

image

మద్యం తాగే ముందు రెండుమూడు చుక్కలను నేలపై చల్లడం చూస్తుంటాం. దిష్టి తలగకుండా అని, పెద్దలకోసం అని కొందరు చెబుతుంటారు. అయితే, గతంలో ఇంట్లోనే మద్యం తయారుచేసుకునేవారని, దీన్ని పరీక్షించేందుకు ఇలా చేసేవారని మరికొందరు అంటున్నారు. నేలపై లిక్కర్ చుక్కలు వేసినప్పుడు బుడగలు ఏర్పడితే స్ట్రాంగ్‌ ఉందని అర్థమని చెప్పారు. రాజులపై విష ప్రయోగం జరిగిందో లేదో తెలుసుకోడానికి గతంలో ఇలా చేసేవారని మరికొందరి మాట.

News October 20, 2024

మహిళ పొట్టలో 12 ఏళ్ల పాటు కత్తెర!

image

ఆ మహిళకు 12 ఏళ్ల క్రితం 24 గంటల నొప్పి రావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి తరచూ పొట్టలో నొప్పితో ఇబ్బంది పడుతోంది. ఇటీవల ఆ నొప్పి మరీ ఎక్కువ కావడంతో మళ్లీ అదే ఆస్పత్రిని సంప్రదించింది. ఎక్స్‌రే పరీక్షలో ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి 12 ఏళ్ల నాటి ఆ కత్తెరను తొలగించారు. ఈ ఆసక్తికర ఘటన సిక్కింలో చోటుచేసుకుంది.

News October 20, 2024

‘బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగొచ్చు’

image

బంగ్లాదేశ్‌లో 2025లో సాధారణ ఎన్నికలు జరగొచ్చని అక్కడి తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అంచనా వేశారు. ఎన్నికలు నిర్వహించడానికి ముందు చాలా అంశాలను పరిష్కరించాల్సి ఉందన్నారు. రాజకీయ సంస్కరణలు, సెర్చ్, ఎన్నికల కమిటీల ఏర్పాటు, ఓటరు జాబితా తయారీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్లతో PMగా షేక్ హసీనా తప్పుకుని దేశం వీడారు. అప్పటి నుంచి బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.