News October 20, 2024
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

విధినిర్వహణలో అసాంఘిక శక్తుల చేతిలో మృతిచెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని కర్నూలు ఎస్పీ జి.బిందుమాధవ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ముగ్గురు అమరవీరుల కుటుంబాలు, విధినిర్వహణలో మరణించిన 10 మంది పోలీసు కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రయోజనాలు(బెనిఫిట్స్) అందజేశారు.
Similar News
News January 16, 2026
పాణ్యం మండలంలో విషాదం

పాణ్యం మండలం తమ్మరాజుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని రత్నమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొని ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆమె ఫుట్‌పాత్‌పై పడి తీవ్ర గాయంతో మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
News January 16, 2026
కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.