News October 20, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు

image

TG: రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా BRS ఆందోళనలు చేపట్టనుంది. మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు బంధును ఎత్తివేసే కుట్రలో భాగంగానే రైతు భరోసా పేరుతో క్యాబినెట్ సబ్ కమిటీ, కొత్త గైడ్‌లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్‌కు రైతుల ఉసురు తగులుతుందని దుయ్యబట్టారు.

Similar News

News October 20, 2024

BREAKING: భారత్ పరాజయం

image

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచులో భారత్ పరాజయం పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన NZ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యంగ్(45*), రవీంద్ర(39*) జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటవ్వగా, రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు NZ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.

News October 20, 2024

ప్రియాంకపై పోటీ.. ఎవరీ నవ్యా హరిదాస్?

image

వయనాడ్ MP స్థానంలో ప్రియాంకా గాంధీ(INC)పై BJP నుంచి <<14401386>>నవ్యా హరిదాస్(39)<<>> పోటీ చేయనున్నారు. బీటెక్ పూర్తిచేసిన ఈమె రాజకీయాలపై ఆసక్తితో BJPలో చేరారు. కోజికోడ్ కార్పొరేషన్‌లో 2సార్లు కౌన్సిలర్‌గా గెలిచారు. 2021లో కోజికోడ్ సౌత్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు MPకి పోటీ చేసే అవకాశాన్ని అధిష్ఠానం కల్పించింది. ఈమె భర్త శోభిన్ శ్యామ్ మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

News October 20, 2024

మరణశిక్ష పడేలా చూడండి: సీఎం చంద్రబాబు

image

AP: బద్వేల్ ఘటనలో యువతి <<14403526>>చనిపోవడంపై <<>>సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థి ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘విచారణ పూర్తి చేసి, నిందితుడికి మరణశిక్ష పడేలా చేయాలి. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలి. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.