News October 20, 2024
KL కథ ముగిసినట్లేనా? సర్ఫరాజ్ వచ్చేస్తారా?

టాలెంటెడ్ ప్లేయర్‌గా ముద్రపడ్డ కేఎల్ రాహుల్ ఇటీవల దారుణంగా విఫలం అవుతున్నారు. నిన్న కీలక సమయంలో రాణిస్తాడని ఆశలు పెట్టుకున్న భారత అభిమానులకు నిరాశే మిగిల్చారు. కేవలం 12 రన్స్ కొట్టి పెవిలియన్ చేరారు. ఇప్పటికే అతడికి టీం మేనేజ్‌మెంట్ చాలా అవకాశాలు ఇచ్చిందని, అతడిని పక్కనబెట్టాల్సిన సమయం వచ్చిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మిడిలార్డర్‌లో సర్ఫరాజ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News February 13, 2026
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా

TG: నల్గొండ జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో పాగా వేసింది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ల పీఠాలను సొంతం చేసుకుంది. అటు సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, నేరేడుచర్లలోనూ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తిరుమలగిరిలో BRS గెలిచింది.
News February 13, 2026
స్కూళ్లను బాగు చేస్తే ప్రమాణాలు ఎందుకు దిగజారాయి: లోకేశ్

AP: స్కూళ్లలో సదుపాయాల కోసం ₹7500 CR ఖర్చు చేయాల్సి ఉందని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. ‘18 అంశాల్లో స్కూళ్లకు రేటింగ్ ఇవ్వగా 40% 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి. 84.3% 3వ తరగతి, 62.5% 5వ తరగతి, 47% 8వ తరగతి విద్యార్థులు 2వ క్లాస్ పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. YCP హయాంలో అద్భుతంగా చేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఇంతలా ఎందుకు పడిపోయాయి’ అని ప్రశ్నించారు. వీటిని మెరుగుపరుస్తామని చెప్పారు.
News February 13, 2026
సిరిసిల్లలో BRS విజయం, ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో BRS విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 చోట్ల BRS గెలిచింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డు సొంతం చేసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది.


