News October 20, 2024

వ్యక్తి కాళ్లు మొక్కబోయిన సీఎం చంద్రబాబు

image

AP: అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిన్న సీఎం చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకుంటుండగా ఓ వ్యక్తి ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో చంద్రబాబు కూడా ఆ వ్యక్తి కాళ్లను పట్టుకునేందుకు కొంచెం నడుము ఒంచారు. దీంతో అతను కంగుతిన్నాడు. తల్లిదండ్రులు, గురువుల కాళ్లకు మాత్రమే నమస్కరించాలని, తన కాళ్లకు మొక్కితే తాను అలాగే చేస్తానని ఇటీవల CBN చెప్పిన విషయం తెలిసిందే.

Similar News

News September 19, 2025

పాకిస్థాన్ ఓవరాక్షన్‌పై ICC సీరియస్!

image

ఆసియా కప్: యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ ఓవరాక్షన్ వల్ల మ్యాచ్ గంట ఆలస్యమైన విషయం తెలిసిందే. ఆ రోజు రూల్స్ అతిక్రమించారని PCBకి ICC లేఖ, ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. స్టేడియంలో వీడియో రికార్డ్ చేసి వారి SM ఖాతాల్లో పోస్ట్ చేయడంపై కూడా సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలోనే PCBపై చర్యలు తీసుకునేందుకు ICC సిద్ధమవుతోందని సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News September 19, 2025

సుస్థిర నగరంగా అమరావతి నిర్మాణం: CRDA

image

AP: ప్రభుత్వం నిర్మించబోయే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) మినియేచర్ మోడల్స్‌ను ప్రజల సందర్శనార్ధం CRDA ప్రదర్శించనుంది. ఈ నమూనాలను విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో CRDA కమిషనర్ కన్నబాబు ప్రాపర్టీ ఫెస్టివల్ నిర్వాహకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి 21వరకు 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో ఈ మోడల్స్ ప్రదర్శన కోసం ఉంచనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, HOD 4 టవర్స్ నిర్మించనున్నామన్నారు.

News September 19, 2025

కరేడులో భూములు లాక్కోవడం లేదు: అనగాని

image

AP: నెల్లూరు(D) ఉలవపాడు(M) కరేడులో ఇండోసోల్ కంపెనీ కోసం రైతుల నుంచి భూములు లాక్కోవడం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నష్టపరిహారం ఎకరాకు రూ.20 లక్షలుగా నిర్ణయించడంతో రైతులే సమ్మతించి భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికే 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోగా, 300 ఎకరాలకు నష్టపరిహారం కూడా చెల్లించామన్నారు. మండలిలో YCP MLC మాధవరావు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు.