News October 20, 2024

చరిత్ర సృష్టించేదెవరో?

image

మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా చరిత్రే కానుంది. పురుషుల జట్లకు సాధ్యం కాని ఈ ఫీట్‌ను తమ దేశానికి అందించాలని మహిళా ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు. గత టోర్నీలోనూ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా ఈ సారి ట్రోఫీపై కన్నేసింది. మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

Similar News

News October 20, 2024

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు: మంత్రి నాదెండ్ల

image

AP: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ స్కీమ్ కింద అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా అందిస్తామని పేర్కొన్నారు. పథకం అమలుకు ఏడాదికి రూ.3,000కోట్ల ఖర్చు అవుతుందని, తదుపరి క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించారు.

News October 20, 2024

ఆ ఏడాది OCT 5-14 తేదీలేమయ్యాయి?

image

తేదీలు మాయమవడం ఏంటని అనుకుంటున్నారా? గూగుల్‌లో 1582 నాటి క్యాలెండర్‌ను ఓ సారి చెక్ చేయండి. అక్టోబర్ నెలలో 5 నుంచి 14 వరకు తేదీలు కనపించవు. అప్పటివరకు సోలార్ క్యాలెండర్‌ను బేస్ చేసుకొని రూపొందించిన జూలియన్ క్యాలెండరే చాలా దేశాలు అనుసరించేవి. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్‌ అందుబాటులోకి రావడంతో 10 రోజులు ముందుకు వెళ్లాల్సి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ అదే క్యాలెండర్‌ను అనుసరిస్తున్నాం.

News October 20, 2024

రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు

image

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీనే కారణమని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. పిచ్‌ను ఆయన సరిగా అంచనా వేయలేదని, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశారని అంటున్నారు. NZ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలోనూ బౌలర్లను సరిగా వినియోగించుకోలేదని, అశ్విన్‌కు చివర్లో బౌలింగ్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ‘CLUELESS CAPTAIN ROHIT’ అని Xలో ట్రెండ్ చేస్తున్నారు.