News October 20, 2024

వర్షం నిలిచింది.. కొద్ది సేపట్లో మ్యాచ్ మొదలు

image

వర్షం కారణంగా ఇండియా, న్యూజీలాండ్ మ్యాచ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్‌ను 10.15 గంటలకు స్టార్ట్ చేయనున్నారు. తొలి సెషన్ 10.15 నుంచి 12.30 వరకు జరగనుంది. 12.30-1.10 వరకు లంచ్ బ్రేక్ ఉండనుండగా తిరిగి 1.10కి సెకండ్ సెషన్, 3.30కి మూడో సెషన్ జరగనుంది. ఈరోజు మొత్తం 91 ఓవర్లు ఆడనున్నారు.

Similar News

News December 28, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<>BEL<<>>) ఘజియాబాద్‌లో 90 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిప్లొమా అర్హతగల వారు డిసెంబర్ 30 వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 21ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అప్రెంటిస్‌లకు నెలకు స్టైపెండ్ రూ.12,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in

News December 28, 2025

దుర్గగుడిలో పవర్ కట్.. ఏం జరిగిందంటే?

image

AP: నిన్న విజయవాడ దుర్గగుడిలో 3 గంటల పాటు పవర్ కట్‌ చేయడం సంచలనంగా మారింది. మూడేళ్లకు కలిపి రూ.4.5 కోట్ల బిల్లులు ఉన్నాయని విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. అయితే దుర్గామాత ఆలయ భూముల్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తును 2023 నుంచి విద్యుత్ శాఖకు ఇస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. నెట్ మీటరింగ్ జీరో అవుతుందని, బిల్లులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ పంచాయితీపై CMO సీరియస్ అయింది.

News December 28, 2025

బంగ్లా ‘యాంటీ ఇండియా’ మంత్రం

image

బంగ్లాదేశ్‌లో ర్యాడికల్ స్టూడెంట్ లీడర్ హాదీ హత్యను అక్కడి ఇస్లామిస్ట్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. నిరసనలతో దేశాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారత్‌, ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘భారత వ్యతిరేక’ ధోరణి అక్కడ బలమైన శక్తిగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా ఈ భావోద్వేగాలను విస్మరించలేని పరిస్థితి.