News October 20, 2024
NZB: సర్పంచ్, ఉప సర్పంచ్ అవ్వాల్సిందే!

కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 2, 3 నెలల్లో పంచాయతీ పోరు జరగనుండగా పల్లెల్లో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. గతంలో ఓడినవారు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, గతంలో గెలిచిన వారు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మరోసారి.. ఏదైతేనేం ఎలాగైనా సర్పంచ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు పావులు కదుపుతున్నారు.
Similar News
News March 4, 2026
UPDATE: పట్టుబడిన ముఠా సభ్యులు వీరే: CP

అంతర్ రాష్ట్ర కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను NZB పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఠాలో అఫ్జల్ ఖాన్, అర్బాజ్, అన్సార్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్, మమ్మద్ అప్సర్, మహబూబ్ ఖాన్, షేక్ ఆరిఫ్, మహమ్మద్ రాజా, బోర్గే బాలాజీ అను 10 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు CP సాయి చైతన్య చెప్పారు. ఆన్సర్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్ అనే ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు.
News March 3, 2026
NZB: CM రేవంత్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు అందించారు.
News March 3, 2026
భారతీయుల కోసం 24/7 హెల్ప్ లైన్ సేవలు!

యూఏఈలో నివసిస్తున్న భారతీయుల కోసం ఇండియన్ పీపుల్స్ ఫోరం (IPF) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ, న్యాయ సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో కన్వీనర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ఈ సేవలను ప్రశంసిస్తూ, యూఏఈలోని భారతీయులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరితగతిన సాయం అందించడమే ఈ ఫోరం లక్ష్యమని పేర్కొన్నారు.


