News October 20, 2024
టీటౌన్ రూమర్: OG మూవీలో అకీరా నందన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అకీరా తన తండ్రితో కలిసి నటించనున్నారని తెలియడంతో అభిమానులు ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు.
Similar News
News March 15, 2025
నేడు తణుకులో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తణుకులో పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్’లో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉ.7.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 8.05కు తణుకు చేరుకుంటారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పార్టీ శ్రేణులు, అధికారులతో సమావేశమై 12.55 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
News March 15, 2025
స్టాలిన్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్

త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న స్టాలిన్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ఈడీ సోదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రంపై విమర్శలకు దిగిందని అన్నారు. బడ్జెట్ పత్రాల్లో రూపీ(₹) చిహ్నం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ సంస్థలను ఉల్లంఘించడమేనని ఫైరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారన్నారు.
News March 15, 2025
గ్రీన్‌కార్డు హోల్డర్స్ శాశ్వత పౌరులేమీ కాదు: జేడీ వాన్స్

గ్రీన్ కార్డు సిటిజన్స్ అమెరికా శాశ్వత పౌరులేమీ కాదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. USAకు వారివల్ల ప్రమాదం ఉందని తెలిస్తే వారినీ దేశం నుంచి బహిష్కరిస్తామన్నారు. గ్రీన్‌కార్డు హోల్డర్స్ ఇమిగ్రేషన్ పాలసీకి భంగం కలిగించనంత వరకే వారు దేశంలో ఉండేలా హక్కు ఉందని దానిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అధ్యక్షుడు ఎవరినైనా USAనుంచి పంపించాలనుకుంటే వెళ్లాల్సిందేనని చెప్పారు.