News October 20, 2024
అలాంటి నిర్మాణాలను కూల్చివేయం: హైడ్రా

TG: చట్టపరమైన అనుమతులున్న వెంచర్లు, భవనాల విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని హైడ్రా పేర్కొంది. చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను కూల్చివేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అన్ని పర్మిషన్లు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమన్న సీఎం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.
Similar News
News September 18, 2025
లిక్కర్ స్కాం.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న 8 మంది నిందితులకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో వారికి రిమాండ్ ముగియనుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ హాజరుపరిచింది. కాగా ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టవ్వగా, నలుగురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.
News September 18, 2025
రాహుల్ ఆరోపణలు నిరాధారం: ఈసీ

పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన <<17748163>>ఆరోపణలు <<>>నిరాధారమని ఈసీ కొట్టిపారేసింది. ప్రజల ఓట్లు ఏ ఒక్కటి ఆన్‌లైన్ ద్వారా డిలీట్ చేయలేదని తెలిపింది. సంబంధిత వ్యక్తికి తెలియకుండా ఓట్లను తొలగించలేదని వెల్లడించింది. 2023లో అలంద్‌లో ఓట్లు డిలీట్ చేసేందుకు ప్రయత్నిస్తే FIR నమోదుచేశామని పేర్కొంది. అలంద్‌లో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ గెలిచినట్లు తెలిపింది.
News September 18, 2025
లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.