News October 20, 2024
HYD: డిసెంబర్ 19 నుంచి బుక్ ఫెయిర్

పుస్తకాలు చదివే సంస్కృతి మరింతగా పెరగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంత్రి కార్యాలయంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బుక్ ఫెయిర్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పుస్తకాభిమానులకు అనుకూలంగా నగర నడిబొద్దున పుస్తక ప్రదర్శన నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు.
Similar News
News January 20, 2026
RR: బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్స్‌కు అప్లై చేసుకోండి

PWDs సాధికారత, లబ్ధికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా మహిళలు, శిశువులు, దివ్యాంగులు & వృద్ధుల సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ మొదలైన సహాయ ఉపకరణాలను అందిస్తామన్నారు. జనవరి 21 నుంచి జనవరి 30వ తేదీలోపు OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు.
News January 20, 2026
HYDలో ఫేక్ ట్రాఫిక్ చలాన్ల కలకలం: జాగ్రత్త!

HYDలో నకిలీ ట్రాఫిక్ చలాన్ల మోసాలు పెరుగుతుండటంపై పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫిషింగ్ లింక్‌లను నిందితులు SMS ద్వారా పంపుతున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బాధితుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ సైట్లు ఎల్లప్పుడూ .gov.in లేదా .orgతో ముగుస్తాయని, SMS లింక్‌ల ద్వారా చెల్లింపులు చేయొద్దని అధికారులు సూచించారు.
News January 19, 2026
RR: సర్పంచ్‌లకు ముచ్చింతల్‌లో శిక్షణ

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు 5 విడతల్లో రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని 2 సమావేశ మందిరాలను సిద్ధం చేశారు.


