News October 20, 2024

మరణశిక్ష పడేలా చూడండి: సీఎం చంద్రబాబు

image

AP: బద్వేల్ ఘటనలో యువతి <<14403526>>చనిపోవడంపై <<>>సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థి ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘విచారణ పూర్తి చేసి, నిందితుడికి మరణశిక్ష పడేలా చేయాలి. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలి. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.

Similar News

News October 21, 2024

TODAY HEADLINES

image

☛ రేపు యథావిధిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
☛ హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మార్చాలి: సీఎం రేవంత్
☛ రేవంత్ హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు: కిషన్‌రెడ్డి
☛ బద్వేల్ ఘటన.. నిందితుడికి కఠిన శిక్ష పడాలి: సీఎం చంద్రబాబు
☛ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: జగన్
☛ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు: మంత్రి నాదెండ్ల
☛ మహిళల టీ20 WC విజేతగా న్యూజిలాండ్
☛ తొలి టెస్టులో INDపై NZ విజయం

News October 21, 2024

3 నిమిషాలకు మించి హగ్ చేసుకోవద్దు: ఎయిర్‌పోర్టు

image

న్యూజిలాండ్‌లోని డునెడిన్ ఎయిర్‌పోర్టు ఆసక్తికర నిబంధన తీసుకొచ్చింది. సెండాఫ్ ప్రాంతంలో 3 నిమిషాలకు మించి హగ్ చేసుకోకూడదని కండీషన్ పెట్టింది. మరీ బెంగగా ఉన్నవారు కారు పార్కింగ్‌లోనే కౌగిలింతలు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, కానీ ఒక హగ్‌కు 20 సెకన్ల వ్యవధి చాలని ఎయిర్ పోర్ట్ సీఈఓ డేనియెల్ డి బోనో స్పష్టం చేశారు.

News October 21, 2024

నిద్రలో ఈ మూడు దశలు తెలుసా?

image

నిద్రలో కళ్లు వేగంగా కదులుతుండే దశ(REM), నెమ్మదిగా కదిలే దశ(NREM) ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. వాటిలోనూ మూడు ఉప దశలున్నాయి. తొలి ఉప దశ పేరు N1. అప్పుడప్పుడే నిద్ర పడుతున్న సమయమిది. ఇక రెండోది N2. గుండె వేగం, శరీర ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. మూడో ఉప దశను N3గా పిలుస్తారు. ఇది లోతైన నిద్ర. ఈ దశలో మనిషి మత్తుగా పడుకుంటాడు. N3లో ఎక్కువ సేపు ఉంటే అలసట ఉండదని పరిశోధకులు వివరించారు.