News October 20, 2024

కామారెడ్డి: మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

image

 రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

Similar News

News February 3, 2025

NZB: ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజమాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను 141 అర్జీల రూపంలో అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.

News February 3, 2025

NZB: బీజేపీ జిల్లా అధ్యక్షునిగా కులచారి దినేశ్

image

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కులచారి దినేశ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.కాసం వెంకటేశ్వర్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల సందర్భంగా దినేశ్ కులచారి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

News February 3, 2025

NZB:100 మీటర్స్ హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్

image

జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లవిరెడ్డి 100 మీటర్ల హార్డిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో జరుగుతున్న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా 40 ఏళ్ల పై కేటగిరిలో పల్లవి గోల్డ్ మెడల్ సాధించారు. తెలంగాణకు చెందిన శివ లీల సిల్వర్ మెడల్, జయలక్ష్మి బ్రాంజ్ మెడల్ సాధించారు.