News October 20, 2024

గుంటూరు: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీకామ్ జనరల్&కంప్యూటర్ అప్లికేషన్స్) చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 7, 8,9,10,11,12 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News March 24, 2026

క్రేన్ వక్కపొడి అధినేత గ్రంధి సుబ్బారావు స్ఫూర్తిదాయక ప్రస్థానం

image

క్రేన్ వక్కపొడి సంస్థల అధినేత గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో 1930లో ఆయన జన్మించారు. కేవలం 100 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 1952లో ‘క్రేన్’ సంస్థను స్థాపించి, దానిని వందల కోట్ల స్థాయికి చేర్చారు. వ్యాపారంతో పాటు ఎన్నో సామాజిక సేవలు కూడా చేశారు. అనేక దేవాలయాలు, అన్నదాన సత్రాలను నిర్మించారు. గుంటూరులో అయ్యప్ప ఆలయం కట్టించి వేలాది మందికి అన్నదానం చేశారు.

News March 23, 2026

వంటగ్యాస్‌పై ఆందోళన అవసరం లేదు: మంత్రి పార్థసారథి

image

రాష్ట్రంలో వంటగ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎంతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సరఫరా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇండక్షన్ స్టవ్స్, పైప్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పంటనష్టం అంచనాలు 26లోగా పూర్తి చేసి 31లోగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

News March 23, 2026

GNT: నీటి దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

ప్రపంచ నీటి దినోత్సవం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జల వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. భావితరాలకు శుద్ధ జలాలను అందించడం, కాలుష్యం లేని పర్యావరణం, మంచి వాతావరణం అందించడం అవసరం అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ MD నజీనా బేగం తదితరులు పాల్గొన్నారు.