News October 20, 2024

ఒలింపిక్ వీరుడికి క్యాన్సర్.. ఇంకా నాలుగేళ్లే!

image

బ్రిటిష్ ఒలింపిక్ సైక్లింగ్ ఛాంపియన్ సర్ క్రిస్ హోయ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రెండు నుంచి నాలుగేళ్ల మధ్యలో జీవించే అవకాశం ఉందని వారు చెప్పినట్లు తెలిపారు. 48 ఏళ్ల స్కాట్ 2004- 2012 మధ్యకాలంలో ఆరుసార్లు ఒలింపిక్ స్వర్ణాలు గెలుచుకున్నారు.

Similar News

News October 21, 2024

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న నటి కూతురు

image

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్ టాలీవుడ్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. నటనతోనే కాకుండా తన వాయిస్‌తో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు సత్య కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా తెరకెక్కుతున్న కేసీఆర్(కేశవచంద్ర రమావత్) చిత్రంలో అనన్య లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.

News October 21, 2024

అక్టోబర్ 21: చరిత్రలో ఈరోజు

image

1833: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జననం
1902: స్వాతంత్ర్య సమరయోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు జననం
1947: ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం
1967: క్రీడాకారిణి అశ్వినీ నాచప్ప జననం
1992: హీరోయిన్ శ్రీనిధి శెట్టి జననం
1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం
✦పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

News October 21, 2024

భారత్, బ్రెజిల్‌కు UNSCలో శాశ్వత సభ్యత్వం ఉండాలి: రష్యా

image

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై భారత్‌‌కు రష్యా మద్దతుగా నిలిచింది. ‘భారత్, బ్రెజిల్‌తో సహా ఆఫ్రికా దేశాలకు కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం ఉండాలి. మెజార్టీ వర్గం తరఫున ప్రాతినిధ్యం ఉండటం ఎంతో అవసరం’ అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. చైనా మినహా ఈ మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న బ్రిటన్, US, ఫ్రాన్స్ దేశాలు ఇప్పటికే భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని ఉద్ఘాటించాయి.