News October 20, 2024
ఢిల్లీ ఒకప్పటి ముంబైలా తయారైంది: ఢిల్లీ సీఎం

రోహిణి ప్రాంతంలోని స్కూల్ బయట బాంబు పేలుడు జరగడంపై ఢిల్లీ సీఎం ఆతిశీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నగరం పరిస్థితి 90వ దశకంలో ముంబైలా తయారైంది. ఇక్కడి శాంతి భద్రతలు కేంద్రం చేతిలోనే ఉన్నాయి. కానీ ఆ పని వదిలేసి మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడంపై దృష్టి పెడుతోంది. సిటీలో ఇష్టానుసారం తూటాలు పేలుతున్నాయి. బ్లాక్‌మెయిల్స్, నేరాలు ఘోరంగా పెరిగిపోయాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News January 25, 2026
సంగారెడ్డి: గణతంత్ర వేడుకలకు పోలీస్ గ్రౌండ్స్ సిద్ధం

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంగారెడ్డి పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ పి.ప్రావీణ్య జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల దృష్ట్యా ఎస్పీ పరితోష్ పంకజ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో మైదానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయించి భద్రతా చర్యలు చేపట్టారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
News January 25, 2026
చెప్పింది 3 వేలు.. అసలు లెక్క 30 వేలు!

ఇరాన్ నిరసనల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి 8, 9వ తేదీల్లోనే దాదాపు 30 వేల మంది మృతి చెందినట్లు USకు చెందిన TIME మ్యాగజైన్ వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించిన 3,117 మరణాల కంటే హాస్పిటల్ రికార్డులు, స్థానిక అధికారులు, వైద్యులు తెలిపిన సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. సుమారు 4,000 ప్రాంతాల్లో నిరసనలు జరగగా ఇంటర్నెట్ ఆపేయడం వలన వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియలేదని పేర్కొంది.
News January 25, 2026
ప్రియుడి ఇంటికి నిప్పు.. చివరికి

AP: ప్రియుడిపై కోపంతో అతడి ఇంటికి ప్రియురాలు నిప్పు పెట్టిన ఘటన గుంటూరులోని సుద్దపల్లిలో చోటు చేసుకుంది. వివాహితుడైన మల్లేశ్(31)తో దుర్గ(28) అక్రమసంబంధం పెట్టుకోగా ఇరువురి మధ్య గొడవలు పెరిగాయి. ఈ క్రమంలో ప్రియుడు కుటుంబం ఇంట్లో ఉండగా దుర్గ పెట్రోల్ పోసి నిప్పంటించింది. పెట్రోల్ మీద పడి దుర్గకు కూడా తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.


