News October 20, 2024
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు: మంత్రి నాదెండ్ల

AP: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ స్కీమ్ కింద అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా అందిస్తామని పేర్కొన్నారు. పథకం అమలుకు ఏడాదికి రూ.3,000కోట్ల ఖర్చు అవుతుందని, తదుపరి క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 8, 2025
మెదక్‌లో ముగిసిన జోనల్ స్థాయి మీట్

మూడు రోజులుగా మెదక్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో జరిగిన రాజన్న సిరిసిల్ల 11వ జోనల్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల పీడీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News November 8, 2025
ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

డిజిటల్, ఆన్‌లైన్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.
News November 8, 2025
ఆ MLAలు ఏం చేస్తున్నట్లు?

AP: CM <<18235116>>తాజా వ్యాఖ్యల<<>>తో ఆ ‘48మంది MLAలు’ ఎవరు? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. నెలలో ఒకట్రెండు రోజుల పాటు పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలోనూ పాల్గొనలేరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగే నేతలు గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నట్లు? అని నిలదీస్తున్నారు. అయితే MLAలపై చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? అని అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.


