News October 20, 2024

FLASH: మరో తుఫాన్ వచ్చేస్తోంది!

image

AP: రానున్న 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది. ‘ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి 22న వాయుగుండంగా మారుతుంది. 23న తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉంది. వాయవ్య దిశగా పయనించి 24న ఒడిశా-బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది. దీని ప్రభావంతో 24, 25న ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని తెలిపింది.

Similar News

News October 21, 2024

కేంద్రం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోంది: మహేశ్ కుమార్

image

TG: తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలిచ్చామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ హామీ ఏమైంది? ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకానికి పెట్టిన చరిత్ర BRSది. జీవో 29ను ఫిబ్రవరిలోనే ఇచ్చారు. విపక్షాల ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు?’ అని నిలదీశారు.

News October 21, 2024

పాక్ యువతిని పెళ్లాడిన బీజేపీ నేత కుమారుడు

image

ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ తహ్సీన్ షాహిద్ కుమారుడు మహ్మద్ అబ్బాస్ హైదర్, పాకిస్థాన్‌కు చెందిన ఆంద్లీప్ జారా అనే యువతిని ఆన్‌లైన్‌లో నిఖా చేసుకున్నారు. హైదర్‌కు వీసా లభించకపోవడం, అటు జారా తల్లి అనారోగ్యంతో ICUలో ఉండటంతో ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకున్నట్లు హైదర్ తెలిపారు. తన భార్యకు త్వరలోనే భారత వీసా లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 21, 2024

హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కాన్వాయ్‌కి ప్రమాదం

image

TG: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఓ కారు కాన్వాయ్ మధ్యలోకి వచ్చింది. దీంతో కాన్వాయ్‌లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.