News October 20, 2024

రేవంత్ హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు: కిషన్‌రెడ్డి

image

TG: సీఎం రేవంత్ హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని కేంద్రమంత్రి, BJP నేత కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. హిందూ పండుగల్లో అనేకమందిపై అక్రమ కేసులు పెట్టించారని ఆయన అన్నారు. సికింద్రాబాద్‌లో అమ్మవారి ఆలయ ఘటనపై నిరసన చేస్తున్నవారిపై లాఠీఛార్జ్‌కు సీఎం ఆదేశించారని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుతం ఆయన మరో వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు.

Similar News

News September 19, 2025

మ‌న జీవితం బాధ్యత మ‌న‌దే: సాయి దుర్గ తేజ్‌

image

TG: హెల్మెట్ ధరించడం వల్లే తాను ప్రాణాలతో బయటపడినట్లు హీరో సాయి దుర్గ తేజ్ పేర్కొన్నారు. HYD పోలీసులు నిర్వహించిన ‘ట్రాఫిక్ స‌మ్మిట్ 2025’కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ‘హెల్మెట్ ధ‌రించ‌ని వాళ్ల‌కి, తాగి బండి న‌డిపేవాళ్ల‌కి చిన్న ప‌నిష్మెంట్ ఇస్తే వారికి జీవితాల‌పై మ‌రింత బాధ్య‌త పెరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్ మాత్ర‌మే’ అని తెలిపారు. ఆయ‌న‌ పోలీస్ శాఖ‌కు రూ.5 ల‌క్ష‌లు విరాళాన్ని ఇచ్చారు.

News September 19, 2025

సెప్టెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

✒ 1887: రచయిత, నాస్తికుడు తాపీ ధర్మారావు జననం
✒ 1911: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న జననం
✒ 1924: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం
✒ 1960: భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం(ఫొటోలో)
✒ 1977: క్రికెటర్ ఆకాశ్ చోప్రా జననం
✒ 1965: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం

News September 19, 2025

అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక విజయం

image

ఆసియా కప్: అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 169-8 రన్స్ చేసింది. AFG బ్యాటర్లలో నబి(60), SL బౌలర్లలో తుషారా 4 వికెట్లతో రాణించారు. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(74) చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. AFG బౌలర్లలో ముజీబ్, అజ్మతుల్లా, నబి, నూర్‌ తలో వికెట్ తీశారు. లంక సూపర్ 4కు క్వాలిఫై అవ్వగా.. AFG టోర్నీ నుంచి ఎలిమినేటైంది.