News October 20, 2024
గ్రూప్-1 అభ్యర్థులను రెచ్చగొడుతున్నారు: మహేశ్

TG: గ్రూప్-1 అభ్యర్థులను విపక్షాలే తప్పుదోవ పట్టించి, రెచ్చగొడుతున్నాయని TPCC చీఫ్ మహేశ్ కుమార్ మండిపడ్డారు. GO 29తో రిజర్వేషన్ అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగట్లేదని, ఎంతోమంది నిపుణులతో చర్చించే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మెరిట్ ర్యాంక్ వచ్చిన రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోనే ఉంటారన్నారు. మెయిన్స్ రాస్తున్న వారిలో 70% మంది రిజర్వేషన్ అభ్యర్థులేనని మహేశ్ తెలిపారు.
Similar News
News January 29, 2026
తామరపల్లి గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తామరపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ ఆర్ వి కృష్ణతార తెలియజేశారు. ఆన్‌లైన్ ద్వారా వంద రూపాయలు ఫీజు చెల్లించి, ఫిబ్రవరి 19వ తేదీలోగా దరఖాస్తులను చేసుకోవాలన్నారు. మార్చ్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు.
News January 29, 2026
‘ఫేర్‌వెల్ సాంగ్’.. నా మరణానంతరమే రిలీజ్: జాకీ చాన్

కుంగ్ ఫూ స్టార్ జాకీ చాన్ తన అభిమానులతో ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. తన మరణం తర్వాతే విడుదల చేయాలని ఒక ప్రత్యేక పాట రికార్డ్ చేయించుకున్నట్లు తెలిపారు. బీజింగ్‌లో జరిగిన తన కొత్త సినిమా వేడుకలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ పాట ప్రపంచానికి తానిచ్చే చివరి సందేశమని ఆయన తెలిపారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో భద్రపరిచి, అభిమానులకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
News January 29, 2026
నేతన్నలకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీమ్

AP: మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. హ్యాండ్లూమ్ (మగ్గం)కు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ద్వారా 4 లక్షల మందికి లాభం కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు. దీనివల్ల నెలకు రూ.85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. 50 ఏళ్లకే నేతన్నలకు రూ.4 వేల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.


