News October 21, 2024

విజయనగరంలో TODAY TOP NEWS

image

> బొబ్బిలికి చెందిన 5నెలల చిన్నారి ధన్షికకు నోబెల్ బుక్ అఫ్ రికార్డ్‌లో చోటు > విజయనగరం జిల్లావ్యాప్తంగా ఆరో రోజు పల్లె పండగ వార్షికోత్సవాలు> గుర్లలో శాసన మండలి విపక్షనేత బొత్స పర్యటన>వైసీపీ తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీనివాస్>గుర్లలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన>నెల్లిమర్లలో ఆరుగురు పేకాట రాయళ్లు అరెస్ట్ >విజయనగరంలో ముగిసిన డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన, రూ. 7.20 కోట్ల వ్యాపారం

Similar News

News January 16, 2026

గుర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

image

గుర్ల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు . పండగ సందర్భంగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు తగు సూచనలు సలహాలు ఇచ్చి క్షేమంగా గమ్యస్థానం చేరే విధంగా చూడాలని ఎస్సై నారాయణరావుకు సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.

News January 16, 2026

విజయనగరంలో కేజీ చికెన్ రూ.240

image

నేడు కనుమ పండగ సందర్భంగా మాంసం ప్రియులకు తిందాం అని ఉన్నా శుక్రవారం సెంటిమెంట్‌తో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో చికెన్, మటన్ షాపులు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. కాగా నగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా.. చికెన్ (స్కిన్) రూ.260, స్కిన్ లెస్ రూ.240, రొయ్యలు రూ.350/250, చేపలు రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.

News January 16, 2026

సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

image

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.