News October 21, 2024

సర్ఫరాజ్‌కు వంటమనిషిని ఏర్పాటు చేసిన పంత్

image

సుదీర్ఘ కాలం ఫిట్‌గా ఉండాలని సర్ఫరాజ్ ఖాన్ భావిస్తున్నారని భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ విషయంలో ఖాన్‌‌కు రిషభ్ పంత్ సహాయం చేస్తున్నారన్నారు. ‘ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయానికి ఫిట్‌గా అవ్వాలని సర్ఫ్ భావిస్తున్నారు. దాని కోసం పంత్ ఆయనకు ఓ వంటమనిషిని ఏర్పాటు చేశారు’ అని వెల్లడించారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఖాన్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

Similar News

News October 21, 2024

క్యారెట్లు ఎక్కువగా తింటే చర్మం రంగు మారుతుందా..?

image

క్యారెట్లు మరీ ఎక్కువగా తింటే మనిషి చర్మం స్వల్పంగా ఆరెంజ్ కలర్‌లోకి మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని కెరోటెనీమియాగా వ్యవహరిస్తారు. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మనిషి శరీరంలో విటమిన్-ఏగా మారుతుంది. పిగ్మెంట్ స్థాయి మోతాదుకి మించితే రక్త ప్రసరణలోకి చేరుతుంది. అది ఇంకా పెరిగితే దేహం ఆరెంజ్ కలర్‌లో కనిపించొచ్చని, కానీ ప్రమాదకరమేమీ కాదని నిపుణులు తెలిపారు.

News October 21, 2024

ట్రంప్.. మీరు ఫిట్‌గా ఉన్నారా?: కమలా హారిస్

image

అత్యంత కష్టమైన అమెరికా అధ్యక్ష పదవిలో పనిచేసేంత ఫిట్‌గా ట్రంప్ ఉన్నారా అంటూ కమలా హారిస్ తాజాగా ప్రశ్నించారు. అలసిపోవడం వల్ల పలు ఇంటర్వ్యూలను ట్రంప్ రద్దు చేసుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘ప్రచారంలోనే అలసిపోయే మీరు అధ్యక్ష పదవికి అర్హులేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి’ అని విమర్శించారు. మరోవైపు.. కమలకు కనీసం కుందేలుకున్న ఎనర్జీ కూడా లేదంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.

News October 21, 2024

నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్.. భారీ బందోబస్తు

image

తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు నేటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ రూమ్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో CC కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండకుండా పోలీసులు BNSS 163 సెక్షన్ విధించారు.