News October 21, 2024

భారత్, బ్రెజిల్‌కు UNSCలో శాశ్వత సభ్యత్వం ఉండాలి: రష్యా

image

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై భారత్‌‌కు రష్యా మద్దతుగా నిలిచింది. ‘భారత్, బ్రెజిల్‌తో సహా ఆఫ్రికా దేశాలకు కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం ఉండాలి. మెజార్టీ వర్గం తరఫున ప్రాతినిధ్యం ఉండటం ఎంతో అవసరం’ అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. చైనా మినహా ఈ మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న బ్రిటన్, US, ఫ్రాన్స్ దేశాలు ఇప్పటికే భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని ఉద్ఘాటించాయి.

Similar News

News October 21, 2024

నేడు సుప్రీంలో గ్రూప్-1పై విచారణ

image

TG: గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు, అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. జీవో 29పైనే ప్రధానంగా ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరుగుతాయని, తమకు న్యాయం జరుగుతుందని పిటిషనర్లు ఆశలు పెట్టుకున్నారు. ఓ వైపు విద్యార్థులు ఆందోళనలు, మరో వైపు ప్రభుత్వం ఇవాళ్టి నుంచి పరీక్షలు నిర్వహిస్తుండటంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News October 21, 2024

తుఫాను ముప్పు.. భారీ వర్ష సూచన

image

బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద ఏర్పడ్డ ఆవర్తనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 23నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రంలో ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

News October 21, 2024

క్యారెట్లు ఎక్కువగా తింటే చర్మం రంగు మారుతుందా..?

image

క్యారెట్లు మరీ ఎక్కువగా తింటే మనిషి చర్మం స్వల్పంగా ఆరెంజ్ కలర్‌లోకి మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని కెరోటెనీమియాగా వ్యవహరిస్తారు. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మనిషి శరీరంలో విటమిన్-ఏగా మారుతుంది. పిగ్మెంట్ స్థాయి మోతాదుకి మించితే రక్త ప్రసరణలోకి చేరుతుంది. అది ఇంకా పెరిగితే దేహం ఆరెంజ్ కలర్‌లో కనిపించొచ్చని, కానీ ప్రమాదకరమేమీ కాదని నిపుణులు తెలిపారు.