News October 21, 2024

కేంద్రం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోంది: మహేశ్ కుమార్

image

TG: తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలిచ్చామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ హామీ ఏమైంది? ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకానికి పెట్టిన చరిత్ర BRSది. జీవో 29ను ఫిబ్రవరిలోనే ఇచ్చారు. విపక్షాల ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు?’ అని నిలదీశారు.

Similar News

News October 21, 2024

రేషన్ కార్డులపై శుభవార్త?

image

TG: రేషన్ కార్డుల్లో అర్హుల పేర్లు చేర్చడంపై ప్రభుత్వం త్వరలోనే తీపికబురు అందించనుంది. కుటుంబంలో పిల్లలు, కోడలు, కొత్త సభ్యుల పేర్లు నమోదు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. దాదాపు 10 లక్షల మందికి పైగా పేర్లు చేర్చాలని దరఖాస్తు చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం పూర్తయ్యాక పేర్లు నమోదు చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం.

News October 21, 2024

నెరవేరనున్న ‘వరంగల్ ప్రజల’ చిరకాల వాంఛ

image

TG:’కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ’ కోసం వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. నిన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి <<14406395>>ప్రకటనతో<<>> వారి కల త్వరలోనే నెరవేరనుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్, స్లీపర్ కోచ్‌లు తయారీ కానున్నాయి. ఇటీవలే దీనిపై RVNL, రైల్వే బోర్డు మధ్య చర్చలు జరిగాయి. ఇప్పటికే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ సిద్ధం అవుతుండగా, కోచ్ ఫ్యాక్టరీ కూడా వస్తే ఓరుగల్లు రూపురేఖలే మారిపోతాయి.

News October 21, 2024

రబీసాగు లక్ష్యం 57.65లక్షల ఎకరాలు

image

AP: 2024-25 రబీ సాగుకు సంబంధించిన ప్రణాళికలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 56.58లక్షల ఎకరాలు కాగా ఈసారి 57.65లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించింది. ప్రధానంగా 19.87లక్షల ఎకరాల్లో వరి, 11.17లక్షల ఎకరాల్లో శనగ, 8.44లక్షల ఎకరాల్లో మినుము, 5.23లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేయనున్నారు. రబీకి సబ్సిడీతో 3.85లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం ఇవ్వనుంది.