News October 21, 2024
గెలాక్సీలోనే అతిపెద్ద నక్షత్ర సమూహమిది!

గెలాక్సీలోని అతి పెద్ద నక్షత్ర సమూహాన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ క్లిక్‌మనిపించింది. భూమికి 12వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న దీనిని వెస్టర్‌లండ్ 1గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. దీని ద్రవ్యరాశి సూర్యుడి కంటే 50 వేల నుంచి లక్ష రెట్లు ఎక్కువ. ఈ సమూహంలోని కొన్ని నక్షత్రాలు సూర్యుడి పోలిస్తే పెద్దవిగా, 1 మిలియన్ రెట్లు ఎక్కువగా ప్రకాశిస్తాయి. ఈ క్లస్టర్ వయస్సు 3.5-5 మిలియన్ సంవత్సరాలుంటుంది.
Similar News
News July 7, 2025
నేడు ఐసెట్ ఫలితాలు విడుదల.. Way2Newsలో వేగంగా..

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలు ఇవాళ మ.3 గంటలకు విడుదల కానున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,398 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌పై హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి.
News July 7, 2025
BIG ALERT.. అతి భారీ వర్షాలు

TG: పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. అటు రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నిన్న పలు జిల్లాల్లో వర్షాలు పడిన సంగతి తెలిసిందే.
News July 7, 2025
డార్క్ చాక్లెట్ తినడం వల్ల లాభాలు!

ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. కానీ, డార్క్ చాక్లెట్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
*రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
*యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి
*జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గుతుంది
*జీర్ణక్రియ మెరుగవుతుంది
*వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
*మూడ్ బూస్టర్గా పనిచేస్తుంది