News October 21, 2024

తుఫాను ముప్పు.. భారీ వర్ష సూచన

image

బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద ఏర్పడ్డ ఆవర్తనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 23నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రంలో ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Similar News

News October 21, 2024

అదనంగా 1.4లక్షల మందికి పంట రుణాలు!

image

AP: ఈ రబీ సీజన్‌లో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని వ్యవసాయశాఖ నిర్దేశించింది. అందులో రూ.68,060 కోట్లు పంట రుణాలు, రూ.32,390 కోట్లు టర్మ్ లోన్స్ ఇవ్వనుంది. గత సంవత్సరం 3.60 లక్షల మంది కౌలు దారులకు రూ.4,100 కోట్లు రుణాలు ఇచ్చింది. కాగా ఈసారి కనీసం 5 లక్షల మందికి రూ.5వేల కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

News October 21, 2024

DANGER BELL: కుప్పకూలనున్న అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థ?

image

ప్రతి ఎకానమీకి బ్యాంకింగ్ సిస్టమే పట్టుగొమ్మ. దానికే చీడపడితే ఆ దేశం దివాలా తీయడం ఖాయం! భూతల స్వర్గంగా భ్రమించే అమెరికా ప్రస్తుత పరిస్థితి ఇదే. ఎందుకంటే US బ్యాంకుల నష్టాలు చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నాయి. 2008లో సబ్‌ప్రైమ్ క్రైసిస్‌ టైమ్‌లో $75bns లాసెస్‌తోనే ప్రపంచం అతలాకుతలమైంది. 2024 నాటికి ఇవి 7 రెట్లు పెరిగి $500bnsకు చేరాయి. చాలా బ్యాంకులు లిక్విడ్ క్యాష్ లేక తల్లడిల్లుతున్నాయి.

News October 21, 2024

విజయవాడలో రేపు, ఎల్లుండి డ్రోన్ షో

image

AP: విజయవాడలో డ్రోన్‌షోకు సర్వం సిద్ధమైంది. 5000 డ్రోన్లతో పున్నమి ఘాట్‌లో రేపు, ఎల్లుండి షో నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కనకదుర్గమ్మ, వివిధ రూపాలు, బొమ్మలు, ఆకారాలు, పేర్లు వచ్చేలా నింగిలో డ్రోన్లు కనువిందు చేయనున్నాయి. బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగ్, వారధి, బస్టాండు, ప్రకాశం బ్యారేజీ వద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు షో చూసేందుకు హాజరవనున్నారు.