News October 21, 2024

నెరవేరనున్న ‘వరంగల్ ప్రజల’ చిరకాల వాంఛ

image

TG:’కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ’ కోసం వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. నిన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి <<14406395>>ప్రకటనతో<<>> వారి కల త్వరలోనే నెరవేరనుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్, స్లీపర్ కోచ్‌లు తయారీ కానున్నాయి. ఇటీవలే దీనిపై RVNL, రైల్వే బోర్డు మధ్య చర్చలు జరిగాయి. ఇప్పటికే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ సిద్ధం అవుతుండగా, కోచ్ ఫ్యాక్టరీ కూడా వస్తే ఓరుగల్లు రూపురేఖలే మారిపోతాయి.

Similar News

News January 3, 2025

రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 1 నుంచి స్టార్ట్ చేస్తారని భావించినా.. అనివార్య కారణాల రీత్యా 4 నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పథకాన్ని ఆరంభించనున్నారు. 475 కాలేజీల్లో జరిగే ఈ కార్యక్రమం కోసం సర్కారు రూ.115 కోట్లు కేటాయించింది.

News January 3, 2025

సంక్రాంతికి ట్రావెల్స్ సంస్థల దోపిడీ

image

సంక్రాంతికి ఊళ్లు వెళ్లేవారిని ట్రావెల్స్ సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. రైలు టికెట్లు నెలల ముందే నిండిపోవడం, ఆర్టీసీలోనూ ఖాళీలు లేకపోవడంతో ప్రయాణికులకు వేరే దారి లేని సందర్భాన్ని వాడుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు టికెట్ ధర రూ.6వేలు ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీని ప్రభుత్వాలు అడ్డుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News January 3, 2025

IND vs AUS 5వ టెస్ట్.. ఇరు జట్లు ఇవే!

image

టీమ్ ఇండియా: యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(w), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(C), ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(C), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలండ్.