News October 21, 2024

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

చంద్రశేఖరపురం మండలం డీజీపేటకు చెందిన వృద్ధురాలు డేగ రత్తమ్మ (58) హత్యకు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం గడ్డికోసం రత్తమ్మ పొలం వెళ్లారు. పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు అమెను హత్యచేసి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, కమ్మలు దొంగిలించారు. సాయంత్రమైనా రత్తమ్మ ఇంటికి రాలేదని స్థానికులు పొలానికి వెళ్లి చూడగా హత్యకు గురైంది. పామూరు CI, చంద్రశేఖరపురం SI ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Similar News

News April 6, 2026

తౌషిక్ మృతి కేసు.. ఆ డేటానే కీలకం..!

image

నవోదయ విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పునః విచారణలో భాగంగా ఆదివారం మొత్తం 13 ఫోన్లను విచారణాధికారి సీజ్ చేశారు. ఇందులో కళాశాల యాజమాన్యం, ఒక మహిళా టీచర్, వార్డెన్ ఫోన్లతోపాటు సింగరాయకొండ పోలీసుల ఫోన్లు, పోస్టుమార్టం నిర్వహించిన ఒంగోలు రిమ్స్ డాక్టర్ ఫోన్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కాల్ డేటా ఆధారంగా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

News April 5, 2026

భైరవకోన పూజారిపై కత్తితో దాడి

image

సీఎస్ పురం మండలం భైరవకోన దేవస్థానం పూజారిగా పని చేస్తున్న రామమూర్తి ఆలయ సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర ఉండగా ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఒక్కసారిగా బైక్‌పై వచ్చి భుజం దగ్గర 2 సార్లు కత్తితో పొడిచాడని పూజారి చెప్పుకొచ్చారు. స్థానికులు పూజారిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News April 5, 2026

పామూరు: నాన్నా జాగ్రత్త అని అరచేతిపై రాసుకుని.. కూతురి సూసైడ్

image

మార్కాపురం(D)లో శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. పామూరు (M) అయ్యవారిపల్లికి చెందిన మాధవి.. నాగూర్ బాషా <<19569072>>లైంగిక వేధింపులకు<<>> గురి చేస్తున్నాడని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయే ముందు మాధవి ‘నాన్నా జాగ్రత్త’ అంటూ తన అరచేతిపై రాసుకోవడం అందరిని కంటతడి పెట్టించింది. నాగూర్ మాధవిని నగ్న చిత్రాలతో వేధిస్తున్నట్లు సమాచారం.