News October 21, 2024

STOCK MARKETS: నేడెలా ఆరంభం కావొచ్చంటే!

image

బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో మొదలవ్వొచ్చు. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిక్కీ, తైవాన్, కోస్పీ, జకార్తా సూచీలు మెరుగ్గా ట్రేడవుతున్నాయి. చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. OCTలో FIIలు రూ.80,217 కోట్లను వెనక్కి తీసుకున్నారు. DIIలు రూ.74,176 కోట్లు పెట్టుబడి పెట్టారు. అంటే నెట్ లాస్ తక్కువగానే ఉంది. కంపెనీల రిజల్ట్స్‌ను బట్టి సూచీల కదలిక ఉంటుంది.

Similar News

News October 21, 2024

గ్రూప్-1.. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

image

TG: గ్రూప్-1పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం అయింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పిటిషన్‌ను న్యాయమూర్తి పాస్ ఓవర్ చేశారు. లిస్ట్‌లో పిటిషన్లపై విచారణ మొత్తం పూర్తయ్యాక దీన్ని విచారణకు స్వీకరిస్తామని చెప్పారు. కాగా గ్రూప్-1 అభ్యర్థుల తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.

News October 21, 2024

హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

image

ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం రేపు విచారించే అవకాశం ఉంది. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా, అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేపట్టారని అల్లు అర్జున్‌పై గతంలో కేసు నమోదైంది.

News October 21, 2024

ఘోరం.. తండ్రి అప్పు కట్టలేదని కుమార్తెపై అత్యాచారం

image

సిలికాన్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. తండ్రి అప్పు కట్టలేదని అతని మైనర్ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవికుమార్ అనే వ్యాపారి వద్ద బాలిక తండ్రి రూ.70 వేలు తీసుకుని రూ.30వేలు తిరిగిచ్చాడు. మిగతా రూ.40వేలు, వడ్డీ కోసం రవికుమార్ నిత్యం వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పు చెల్లించాలని బాలికను బెదిరించడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టాడు.