News October 21, 2024

నేడు కోర్టుకు నందిగం సురేశ్

image

AP: వైసీపీ నేత నందిగం సురేశ్‌ను ఈరోజు పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. 2020లో జరిగిన ఘర్షణల విషయంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తారు. రెండు రోజుల పోలీసుల కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టుకు తీసుకొస్తున్నారు. కాగా విచారణలో తేలిన అంశాల ఆధారంగా త్వరలోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Similar News

News March 15, 2025

బెడ్‌పై తిని పడుకుంటే రూ.4.7 లక్షల జీతం

image

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) బంపరాఫర్ ఇచ్చింది. 10 రోజులపాటు వాటర్ బెడ్‌పై పడుకుంటే రూ.4.7 లక్షల జీతం చెల్లిస్తోంది. వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో స్పెషల్ బాత్ టబ్‌లు తయారు చేసింది. ఇందులో పడుకునే 10 మంది వాలంటీర్లకు ఫుడ్, డ్రింక్స్, ఫోన్ అన్ని సమకూరుస్తారు. ఈ 10 రోజులూ వారు ఆ బెడ్‌పై విశ్రాంతి తీసుకోవడమే పని. స్పేస్ జర్నీలో మానవ శరీరంపై ఉండే ప్రభావాలను అంచనా వేసేందుకే ESA ఈ ప్రయోగం చేపట్టింది.

News March 15, 2025

ప్రధాని పెద్దన్న లాంటివారే.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా: రేవంత్

image

TG: పదేపదే తాను ఢిల్లీకి వెళ్తున్నానంటూ BRS చేస్తున్న విమర్శలకు CM రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ప్రధాని పెద్దన్న లాంటివారే. కేంద్రం తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇందులో రాజకీయం ఏముంది? ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా. ప్రతి కేంద్రమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకొస్తున్నా’ అని తెలిపారు.

News March 15, 2025

ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త

image

వీకెండ్ వచ్చిందంటే చాలు బయటి ఫాస్ట్ ఫుడ్ తినడం నేడు సర్వసాధారణంగా మారిపోయింది. అలా తినేవారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌లోని ఏఐఎన్‌యూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఫాస్ట్ ఫుడ్ కారణంగా యువతలో మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు బాగా ఎక్కువ అవుతున్నాయి. క్రియాటినిన్ స్థాయులు పెరుగుతున్నాయి. చాలామంది ఇదే సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీలకు ప్రమాదం’ అని వారు పేర్కొన్నారు.

error: Content is protected !!