News October 21, 2024

MHBD: అన్న అస్తికలు కలపడానికి వెళ్తూ.. తమ్ముడి మృతి

image

అన్న అస్తికలు కలపడానికి వెళ్తూ తమ్ముడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని సుదనపల్లికి చెందిన నర్సయ్య అన్న ఇటీవల మృతిచెందాడు. ఆయన అస్తికలు కలపడానికి కుటుంబీకులతో కలిసి భద్రాచలానికి బయలుదేరారు. ఈ క్రమంలో కురవి మండలం లింగ్యా తండా మూలమలపు వద్ద ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో నీలం నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News January 10, 2026

వరంగల్ చౌరస్తాలో దారి తప్పిన బాలుడు

image

వరంగల్ నగరంలో శనివారం సాయంత్రం వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఓ బాలుడు ఒంటరిగా తిరుగుతూ కనిపించాడు. పేరు అడగగా తన పేరు ‘రేయాన్’ అని మాత్రమే చెప్పాడు. చిరునామా, కుటుంబ వివరాలు చెప్పలేకపోయాడని పోలీసులు చెప్పారు. బాలుడిని గుర్తించిన వారు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని లేదా ఇంతజారుగంజ్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

News January 10, 2026

ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ పూర్తి చేయాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జడ్పీ సీఈవో, ఇన్ ఛార్జ్ డీఆర్డీఓ రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News January 9, 2026

వరంగల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. వంట సిబ్బంది తొలగింపు

image

వరంగల్ జిల్లా సంగెంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ డా.సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట చేసే సిబ్బంది విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, ముగ్గురు వంట సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.