News October 21, 2024

ప.గో: ముగిసిన పల్లె పండగ వారోత్సవాలు

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పల్లె పండగ వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. అక్టోబర్ 14న ప్రారంభమైన ఈ వారోత్సవాలు 20వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఆయా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 2,523 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా ₹.173.87 కోట్లు మంజూరు చేశారు.

Similar News

News March 10, 2026

ATM కార్డు మార్చి.. తణుకులో వృద్ధుడికి కుచ్చుటోపీ

image

ఏటీఎం కేంద్రంలో సహాయం చేస్తానని నమ్మించి ఓ వృద్ధుడిని మోసగించిన ఘటన తణుకులో కలకలం రేపింది. ఎన్‌ఎస్‌సీ బోస్‌ రోడ్డుకు చెందిన బచ్చు సుబ్బారావు సోమవారం ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీఎంలో నగదు తీయడానికి వెళ్లారు. అక్కడ ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం నెపంతో కార్డు మార్చేసి, సుబ్బారావు ఖాతా నుంచి రూ.23,430 నగదు కాజేశాడు. నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

News March 10, 2026

ప.గో: అదనపు కట్నం వేధింపులు.. భర్తతో సహా నలుగురిపై కేసు

image

అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్త, మరిది, మరదలుపై నరసాపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. లుటుకుర్తి రాజేశ్‌కు స్వరూపతో 2020లో వివాహమైంది. అప్పటి నుంచి రాజేశ్ అదనపు కట్నం తేవాలని, అనారోగ్యంతో ఉన్న పిల్లాడి వైద్యానికి కూడా డబ్బులు పంపకుండా, గల్ఫ్‌లో ఉంటూ భర్త వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేశారు.

News March 10, 2026

ప.గో: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. చివరకు..

image

మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, బూతు మాటలతో దూషిస్తున్న మల్లవరపు యేసుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామంలోని మహిళలు పంట బోదే వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఆ సమయంలో యేసు అక్కడకి చేరుకొని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు మొగల్తూరు పోలీసులకు పిర్యాదు చేయగా ఎస్సై జి.వాసు నిందితుడిపై కేసు నమోదు చేశారు.