News October 21, 2024
వాలంటీర్ హత్య కేసు.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

AP: మాజీ మంత్రి, YCP నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు మదురైలో అరెస్ట్ చేశారు. కోనసీమ అల్లర్ల సమయంలో(2022 జూన్ 6న) అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే YCP సోషల్ మీడియా కన్వీనర్ ధర్మేశ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ శ్రీకాంత్‌ను కోర్టులో హాజరుపర్చనున్నారు.
Similar News
News February 3, 2026
నిజామాబాద్‌లో లెక్క తేలింది.. బరిలో 350 మంది..!

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగియగా 60 వార్డులకు గాను 350 మంది పోరు బరిలో నిలిచారు. ఇందులో BJP నుంచి 52 , కాంగ్రెస్ నుంచి 62, BRS నుంచి 59, AIMIM నుంచి 25, AIFB నుంచి 15, BSP నుంచి 3, JSP నుంచి 11, AAP నుంచి 1, CPM నుంచి 3, CPI నుంచి 2, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 17మంది , స్వతంత్ర అభ్యర్థులు 100 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News February 3, 2026
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..

రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఓ లవంగం మొగ్గను నమిలితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుందని పేర్కొంటున్నారు. అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు గోరు వెచ్చని నీరు తాగితే ఆహారం సులభంగా అరుగుతుందని చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీ, కాఫీ లాంటివి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
News February 3, 2026
జల్‌జీవన్ మిషన్ నిధులు నిలిపివేత

జల్‌జీవన్ మిషన్లో మిగిలిన పనులకు నిధులు నిలిపివేస్తున్నట్లు కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. 2019లో చేపట్టిన ఈ స్కీమ్‌లో ₹2.08 లక్షల CR 2024-25కే ఖర్చయి 81.5% పనులే పూర్తయ్యాయి. పలు రాష్ట్రాల్లో అక్రమాలు గుర్తించిన కేంద్రం మిగతా పనులకు నిధులు రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. FY26-27కు కేటాయించిన ₹67,670 CR నిర్వహణకు ఇవ్వనుంది. కాగా APలో రూ.23వేల కోట్ల పనులకు ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది.


