News October 21, 2024

SSC కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్

image

TG: SSC జీడీ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తున్నట్లు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి జనవరి 31 వరకు టీ-శాట్ నెట్‌వర్క్ ఛానళ్ల ద్వారా క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఇటు 1,388 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి కంటెంట్‌ను మరో రెండు గంటలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 16 వరకు రోజూ 4గంటలు ప్రసారం చేస్తామన్నారు.

Similar News

News March 10, 2026

ఎల్ నినో.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: వీసీ

image

AP: ఈ ఏడాది ఏప్రిల్ వరకు ENSO(ఎల్ నినో+లా నినా) పరిస్థితులకు అవకాశం ఉందని ఎన్జీ రంగా వర్సిటీ వీసీ జయలక్ష్మీ దేవి వెల్లడించారు. జులై తర్వాత <<19250011>>ఎల్ నినోకు<<>> 60 శాతం ఛాన్స్ ఉందని తెలిపారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని సూచించారు. నష్టాలను నివారించడానికి వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలన్నారు.

News March 10, 2026

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం: ఇజ్రాయెల్

image

యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 1,900 మంది ఇరాన్ సైనికులు, కమాండర్లను చంపేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌నూ టార్గెట్ చేసే అంశాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. ఇక ఇరాన్, హెజ్బొల్లా దాడుల్లో ఇజ్రాయెల్‌లో 12 మంది పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించినట్లు తెలిపింది. గాయపడిన వారిలో 2,238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని, 91 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.

News March 10, 2026

BREAKING: రూ.10వేలు పెరిగిన KG వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,62,380కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 ఎగబాకి రూ.1,48,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.