News October 21, 2024
తల్లి మృతిపై హీరో ఎమోషనల్ పోస్ట్

తానెంతో ప్రేమించే తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంపై హీరో <<14405382>>కిచ్చా సుదీప్ <<>>ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘ఆమె మనిషి రూపంలో ఉన్న దేవత. నా గురువు. ఇప్పుడు ఆమె జ్ఞాపకమే. నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తీకరించలేకపోతున్నా. ప్రతిరోజు ఉదయం 5.30కి గుడ్ మార్నింగ్ మెసేజ్ వచ్చేది. నేను ఆమెతో చివరిసారి మాట్లాడలేకపోయా. నా జీవితంలో అత్యంత విలువైనది కోల్పోయా. రెస్ట్ తీసుకో అమ్మా’ అని పోస్ట్ చేశారు.
Similar News
News January 24, 2026
కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ

TG: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న విచారణకు హాజరైన విషయాలను గులాబీ బాస్‌కు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో హరీశ్ రావు కూడా ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్, హరీశ్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
News January 24, 2026
అమ్మాయితో అడ్డంగా దొరికిన పలాశ్.. ఫ్రూఫ్ ఏదని ప్రశ్న!

క్రికెటర్ స్మృతి మంధాన మాజీ లవర్ <<18940645>>పలాశ్<<>>పై వస్తున్న ఆరోపణలను అతని లాయర్ శ్రేయాన్ష్ కొట్టిపారేశారు. మరో అమ్మాయితో పలాశ్ అడ్డంగా దొరికిపోయాడన్న విద్యాన్ మానే ఆరోపణలను లాయర్ కొట్టిపారేస్తూ.. ‘దానికి సాక్ష్యం ఏది?’ అని ప్రశ్నించారు. అలాగే ₹40 లక్షల ఫ్రాడ్ ఆరోపణలపై స్పందిస్తూ ఆ డబ్బు చెక్కు ద్వారా ఇచ్చారా లేక ట్రాన్స్‌ఫర్ చేశారా అని నిలదీశారు. అతనికి లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
News January 24, 2026
రథ సప్తమి పూజ ఎలా చేయాలంటే..?

రథసప్తమి నాడు సూర్యరశ్మి పడే చోట ఆవు పేడతో శుద్ధి చేయాలి. పిడకల పొయ్యి పెట్టాలి. ఇత్తడి పాత్రలో ఆవు పాలను పొంగించాలి. పాలు పొంగే సమయంలో కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నం చేయాలి. దాన్ని చిక్కుడాకుల్లో సూర్యుడికి నివేదించాలి. అనంతరం అందరికీ వితరణ చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే చిక్కుడు కాయలు, కొబ్బరి పుల్లలతో చిన్న రథాన్ని తయారు చేసి పూజించాలి. పాలు పొంగడం ఇంటి అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు.


