News October 21, 2024

రబాడ@300

image

దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ అరుదైన క్లబ్‌లో చేరారు. SA తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో ప్లేయర్‌గా నిలిచారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో ఈ ఘనత సాధించారు. 65 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. ఈ జాబితాలో స్టెయిన్(439), పొలాక్(421), ఎన్తిని(390), డొనాల్డ్(330), మోర్కెల్(309) రబాడ కన్నా ముందు ఉన్నారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో మురళీధరన్(800) తొలి స్థానంలో ఉన్నారు.

Similar News

News October 21, 2024

అలాంటి వారు ఇక‌ నో ఫ్లై జాబితాలో: రామ్మోహ‌న్ నాయుడు

image

విమానాల‌కు న‌కిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపడాన్ని నేరంగా ప‌రిగ‌ణించేలా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ చేయనున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. అలాగే బాంబు బెదిరింపుల‌కు పాల్ప‌డిన వారిని నో ఫ్లై జాబితాలో చేర్చ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇప్ప‌టిదాకా 75 సంస్థ‌ల‌కు బెదిరింపులు వ‌చ్చాయి. ఈ బెదిరింపుల విషయంలో ఒకేర‌క‌మైన భాష‌ను ఉప‌యోగిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

News October 21, 2024

నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్

image

AP: ఓ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించారు. సురేశ్ ప్రోద్బలంతోనే ఈ వివాదం జరిగిందనే బంధువుల ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 21, 2024

రైలులో టపాసులు తీసుకెళ్లొచ్చా?

image

దీపావళి సమీపిస్తోంది. చాలామంది పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళుతుంటారు. ఈక్రమంలోనే బాణసంచా కొని ట్రైన్‌లో తీసుకెళదామనుకుంటారు. అయితే రైల్వే సేఫ్టీ రూల్స్ ప్రకారం మండే స్వభావం ఉన్న ఫైర్ క్రాకర్స్‌ను రైలులో తీసుకెళ్లడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్‌ స్టవ్స్, సిలిండర్స్, యాసిడ్స్ వంటివి కూడా తీసుకెళ్లడానికి అనుమతి లేదు.